Lyric songs


1.స్తుతి పాడుటకే బ్రతికించిన

స్తుతి పాడుటకే బ్రతికించిన

జీవనదాతవు నీవేనయ్యా

ఇన్నాళ్లుగా నన్ను పోషించినా

తల్లివలె నన్ను ఓదార్చినా

నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా  - 2

జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా

నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును

1. ప్రాణభయమును తొలగించినావు

ప్రాకారములను స్థాపించినావు

సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు  ||2||

నీ కృపా బాహుళ్యమే-వీడని అనుబంధమై

తలచిన ప్రతిక్షణమున-నూతన బలమిచ్చెను  ||  స్తుతి ॥

2. నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు

కనుమరుగాయెను నా దుఖ:దినములు

కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు ||2||

నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై

నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను.     ॥ స్తుతి ॥

3. హేతువులేకయే ప్రేమించినావు

వేడుకగా ఇల నను మార్చినావు

కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు ||2||

నీ ప్రేమ మాధుర్యమే- నా నోట స్తుతిగానమై

నిలిచిన ప్రతిస్థలమున -పారెను సెలయేరులై 

..................................................................................................................

  నీతో గడిపే ప్రతి క్షణము

నీతో గడిపే ప్రతి క్షణము
ఆనంద బాష్పాలు ఆగవయ్యా ||2||
కృప తలంచగా మేళ్లు యోచించగా ||2||
నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించక
యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా ||4||    

    ||నీతో||

1. మారా వంటి నా జీవితాన్ని
మధురముగా మార్చి ఘనపరచినావు ||2||
నా ప్రేమ చేత కాదు
నీవే నను ప్రేమించి ||2||
రక్తాన్ని చిందించి
నన్ను రక్షించావు ||2||         ||యేసయ్యా||

2. గమ్యమే లేని ఓ బాటసారిని
నీతో ఉన్నాను భయము లేదన్నావు ||2||
నా శక్తి చేత కాదు
నీ ఆత్మ ద్వారానే ||2||
వాగ్ధానము నెరవేర్చి
వారసుని చేసావు ||2||         ||యేసయ్యా||


Back to list | Sunday Songs list
Listen on YouTube

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::


నేనెందుకని నీ సొత్తుగా 
 నేనెందుకని నీ సొత్తుగా మారితిని
యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున  ||2||
నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హృదయసీమ  ||2||
 
1. నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పోందుకోరి – నీ స్నేహితుడనైతినే   ||2||
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును   ||2||         
   ||నేనె||           
2. నీ శ్రమలలో – పాలొందుటయే – నా దర్శనమాయెనే
నా తనువందున – శ్రమలుసహించి- నీ వారసుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును  ||2||             
 ||నేనె|| 
3. నీలో నేనుండుటే – నాలో నీవుండుటే – నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతో – నే పరిపూర్ణత చేందెద  ||2||
     అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును    ||2||         
  ||నేనె||

   --------------------------------------------------------------------------                   

అలసిన బ్రతుకును

అలసిన బ్రతుకును ఆదరించువాడా
విడువక నీకృప కుమ్మరించుదేవా//2//

నేపాడెద ఈస్తుతి గీతము 
చెల్లించెదా కృతజ్ఞత స్తుతులను//2//
 బ్రతుకుదినములన్ని//అలసిన//

నిరాశల దారిలో నిషిధిగల వేలలో
వాక్యవెలుగువై నాముందు నడిచినావు//2//

ఊహకు మించిన ప్రేమ నాపైనచూపించినావు
నను రక్షించుటకోరకే నీప్రాణము అర్పించినావు//2//
          //నీపాడెధ //అలసిన//

కృంగియున్న వేలలో నాశోదన భాధలలో
జీవదాతవై నను ఆదరించావు//2//

పాపిని క్షమించావు నాశాపముతొలగించావు
ధీవెన కలిగించావు నీకృపతో కరుణించావు//2//
         //నీపాడేదా//అలసిన//


ఎన్నో కృపాలు కుమ్మరించినావు

ఎన్నో కృపాలు కుమ్మరించినావు
నాపై తిన్నాగా ప్రేమను చూపి బ్రోచినావు //2//

కన్నవాడవు నీవై యున్నావు యేసునాధా //2//
బిన్నా మైనా త్రోవలన్నీ తొలగించినావు //2//     

 //న్నో// 
దేవా పొందుగా నాలోచించి యుంచినావు  //2//
చిందించి యున్న విలువ సిలువారక్తము వలన. //2//
సంధించి నన్ను నీమందలో చేర్చినావు //2//

                //ఎన్నో//

అల్లారితనము త్రుంచి వేసినావు  నీ చల్లాని వాక్యం బోధించినావు //2//

తల్లితండ్రివీ నీవై తరుచుగా నాదారించి
యుల్లములో కలతలను పోగొట్టినావు //2//
                //అన్నో//
పాప కూపాము నుండి లేపి నావు నీదు ప్రాణమంతయు నాకై పెట్టినావు //2//

కాపరివై శాంతి కలువ యోద్ధకిలలోఅతి మారికి నడిపి దాహంబు తీర్చిమావు //2//

                 //ఎన్నో//


Comments